కావల్సిన పదార్ధాలు: పాలు- ఒక లీటరు పంచదార- తీపికి సరిపడా బాదం పప్పు- పావు కప్పు జీడి పప్పు- పావు కప్పు పిస్తా – పావు కప్పు కుంకుమ పువ్వు రెండు రేకులు డ్రై ఫ్రూట్స్ – సోంపు – రెండు స్పూన్లు యాలకుల పొడి – ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి – కొంచెం గసగసాలు – రెండు స్పూన్లు మిరియాలు – ఐదు, ఆరు
ముందుగా బాదాం పప్పుని నానబెట్టుకోవాలి. కొంచెం సేపటి తర్వాత బాదాం పప్పు పొట్టు తీసుకుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, సోంపు, గసగసాలు, మిరియాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పాలు పోసి.. మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు గ్యాస్ స్టౌ మీద దళసరి గిన్నె పెట్టి.. పాలు పోసి బాగా మరిగించాలి. అనంతరం పంచదార, కుంకుమ పువ్వు వేసి.. కలపాలి. చక్కర కరిగిన అనంతరం మిక్స్ చేసుకుని పెట్టుకున్న బాదాం, జీడిపప్పు మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకుని అడుగుఅంటకుండా కలుపుతూ ఉండాలి.
పాలు చిక్కబడిన అనంతరం.. యాలకుల పొడి, దాల్చిన పొడి వేసుకుని చక్కగా కలిపి.. స్టౌ ఆపి ఈ మిశ్రమాన్ని దింపుకుని.. వేరే గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
కూల్ అయ్యాక ఈ మిల్క్ ను గ్లాస్ లో పోసుకుని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే.. రుచికరమైన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ.. కూల్ కూల్ టేస్టీ టేస్టీ మిల్క్ షేక్ ను ఇంట్లోని పిల్లలు, పెద్దలే కాదు.. అతిధులకు కూడా ఇవ్వడానికి బాగుంటుంది. నోరూరించే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.