ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..


తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి షో నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదిలా ఉంటే థియేటర్స్ లో ఈ సినిమా దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత కుబేర సినిమా పుణ్యమా అని థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కుబేర సినిమా థియేటర్ లో ఊహించని సంఘటన జరిగింది.

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

కుబేర సినిమా ప్రదర్శితమవుతుండగా ఉన్నట్టుండి థియేటర్ సీలింగ్ ఊడి పేక్షకుల పై పడింది. దాంతో పలువురికి గాయాలయ్యాయి. ఇంతకూ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లాలో ముకుంద థియేటర్లో ఈ ఘటన జరిగింది. ముకుంద థియేటర్ లో కుబేర సెకండ్ షో ప్రదర్శితమవుతుండగా ఉన్నట్టుండి థియేటర్ సీలింగ్ ఊడి పేక్షకుల పై పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. దాంతో సినిమాను ఆపేసి వెంటనే గాయపడిన వారికి ప్రధమ చికిత్స చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

ఇక కుబేర సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ , నాగార్జున, రష్మిక తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ నటన పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల మేకింగ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *