వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పెయింటింగ్‌లు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద కురిపిస్తుందని, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఎలాంటి పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందో తప్పక తెలుసుకోవాలి.
పరిగెత్తే ఏడు గుర్రాలు:
ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్‌ను వేలాడదీయడం వల్ల కెరీర్ వృద్ధి, విజయం ఆకర్షిస్తుంది.
ఇవి కూడా చదవండి
బంగారు నాణెం (లేదా) డబ్బు చెట్టు:
వాస్తు ప్రకారం, దక్షిణ లేదా తూర్పు దిశలో బంగారు నాణెం (లేదా) డబ్బు చెట్టు పెయింటింగ్‌ను ఉంచడం వల్ల నగదు ప్రవాహం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
జలపాతం/ ప్రవహించే నీరు:
జలపాతం లేదా ప్రవహించే నీటి చిత్రం శ్రేయస్సు, ధన ప్రవాహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలను నివారించడానికి ఈ పెయింటింగ్‌ను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది.
నెమలి:
నెమలి అందం, సానుకూలతకు చిహ్నం. ఇంటి తూర్పు-ఈశాన్య దిశలో నెమలి చిత్రాన్ని వేలాడదీయడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది. లక్ష్మీ దేవి ఆశీస్సులతో ఆనందం, శ్రేయస్సు ఆకర్షిస్తుంది.
సూర్యోదయం:
ఉదయించే సూర్యుడు కొత్త ప్రారంభాలు, పురోగతిని సూచిస్తుంది. ఈ చిత్రాన్ని ఇంటి తూర్పు దిశలో ఉంచడం వల్ల పని, కెరీర్ వృద్ధికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..