హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శివాని నాగారం షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ లాంటి వెబ్ సిరీస్ లు చేసి యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2024లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. ఇన్ స్టాలో చూసి శివానీని చూసిన దర్శకుడు ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో శివానీ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక గతేడాది రిలీజైన లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్లకు ఫేవరెట్ గా మారిపోయిందీ అందాల తార. అందులో కాత్యాయని పాత్రలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. కాగా సాధారణ హీరోయిన్లలా కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది శివాని. ఇందులో భాగంగా త్వరలోనే ఆమె హే భగవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత మరోసారి హీరో, హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు సుహాస్- శివాని.
గోపి అచ్చర తెరకెక్కిస్తోన్న ఈ సినిమా లో వెన్నెల కిశోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, యాంకర్ స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో, హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ శివాని కో యాక్టర్, హీరో సుహాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నాకు సుహాత్‌తో ఇది రెండో సినిమా. వెరీ స్పెషల్ ఈ మూవీ నాకు.. ఎందుకంటే అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ లో సుహాస్ నాకు అన్ని విషయాల్లో చాలా సపోర్టీవ్‌గా నిలిచాడు. నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా సపోర్టీవ్ పర్సన్ అంటే సుహాసే. అతను నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. సుహాస్ తో మరో సారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది శివానీ. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి
హే భగవాన్ సినిమాలో సుహాస్ తో శివానీ..
కాగా త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి సంయుక్తంగా హే భగవాన్ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.