ఆ సమస్యలకు రామబాణం.. కివి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

ఆ సమస్యలకు రామబాణం.. కివి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..


కివి పండులో ఔషధ గుణాలతోపాటు.. పోషకాలు పుష్కలంగా దాగున్నాయి.. కివిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది. అందుకే.. కివి పండును సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా, శరీరానికి అవసరమైన విటమిన్-సి కివిలో అధికంగా లభిస్తుంది. దీని గుజ్జులో ఉండే చిన్న నల్లటి విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కూడా ఉంటాయి.. ఇవన్నీ మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

శక్తివంతమైన కివి (Kiwifruit) పండులో ఇందులో విటమిన్ సి (నారింజ కంటే ఎక్కువ), విటమిన్ కె, విటమిన్ ఇ, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో సమస్యలకు అమృతఫలంగా పేర్కొంటారు.

కివి పండు ప్రయోజనాలు..

వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: ప్రస్తుత కాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. కివి పండులో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రోజువారీ శరీరానికి అవసరమయ్యే విటమిన్-సి మొత్తాన్ని ఒక కివి పండు అందిస్తుంది.

గుండె ఆరోగ్యం: కివి పండు గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.. తద్వారా గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా 2-3 కివి పండ్లను తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చు. ఆస్పిరిన్ టాబ్లెట్ తరహాలో ఇది గుండెకు రక్షణ కల్పిస్తుంది.

ఆస్తమా – అలర్జీల నివారణ: శీతాకాలం సహా.. సీజన్ మారినప్పుడల్లా.. ఆస్తమా, అలర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి. కివిలో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు ఆస్తమా రోగులకు ఉపశమనం కలిగిస్తాయి. గురక, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను తగ్గిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుదల: మంచి ఆరోగ్యం కోసం జీర్ణక్రియ సక్రమంగా ఉండటం అత్యవసరం. కివి పండులో డైటరీ ఫైబర్‌తో పాటు, ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది.. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం కివిని ఆహారంలో చేర్చుకోవాలి.

కంటి చూపు మెరుగుదల: నేటి కాలంలో చిన్నపిల్లల్లో కూడా కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కివి పండులో జియాజాంతిన్, లుటిన్ అనే రెండు కాంపౌండ్లు ఉంటాయి. లుటిన్‌ను “ఐ విటమిన్” అని కూడా అంటారు. ఈ రెండు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.. కంటి సంబంధిత వ్యాధులు, క్యాటరాక్ట్‌లు రాకుండా రక్షిస్తాయి. రెటీనా దెబ్బతినకుండా కాపాడుతూ, అధిక కాంతి నుండి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యం: కివి చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ ఫైన్ లైన్స్, స్మైల్ లైన్స్ వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కివి పండు గుజ్జును అలోవెరాతో కలిపి రాత్రిపూట ముఖానికి రాసి ఉదయం కడిగేస్తే మొటిమల సమస్య కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి కివి పండు చాలా సహాయకారిగా ఉంటుంది. దీనిలో అధిక నీటి శాతం, తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ లక్షణాలు బరువు తగ్గడానికి దోహదపడతాయి.. అదే సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మంచి నిద్ర: నిద్రలేమితో (ఇన్సోమ్నియా) బాధపడేవారు తమ ఆహారంలో కివి పండును చేర్చుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని 2011లో జరిగిన ఒక పరిశోధనలో తేలింది.

ఇతర ప్రయోజనాలు:

కివిలో విటమిన్-సి తో పాటు ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి, ఐరన్ లోపం (అనీమియా) ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకారి. కివిని బనానాతో కలిపి తీసుకుంటే అనీమియాను అధిగమించవచ్చు.

ఆహారంలో కివి వినియోగం:

అల్పాహారాన్ని దాటవేయడం మంచిది కాదు. తినడానికి ఆసక్తి లేనప్పుడు, కివిని సలాడ్‌గా, స్మూతీగా లేదా స్నాక్‌గా తీసుకోవచ్చు. కివి, దోసకాయ, కొద్దిగా అల్లం కలిపి చేసుకునే జ్యూస్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు, బరువు తగ్గడానికి, శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. వేసవిలో ఈ జ్యూస్ డీహైడ్రేషన్ నుండి కూడా రక్షిస్తుంది.

కివి పండు ప్రస్తుతం అన్నిచోట్లా సులభంగా లభిస్తుంది. దీని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, మీ రోజువారీ ఆహారంలో కివిని చేర్చుకోవడం ఆరోగ్యకరమైన జీవితానికి ఒక మంచి అడుగు అవుతుందని.. ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *