Headlines

ఆవాలు, కరివేపాకుతో ఖతర్నాక్‌ హెయిర్‌ప్యాక్.. ఇలా వాడారంటే నల్లటి పొడవాటి జడ మీ సొంతం!

ఆవాలు, కరివేపాకుతో ఖతర్నాక్‌ హెయిర్‌ప్యాక్.. ఇలా వాడారంటే నల్లటి పొడవాటి జడ మీ సొంతం!


ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సమస్యలతోనే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నల్లగా, పొడవుగా ఉన్న జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. కానీ, నేటి వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే తెల్లజుట్టు, బట్టతల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెంట్రుకలు రాలిపోతుంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తారు.. మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులన్నీ వాడేస్తుంటారు. కానీ ఫలితం కనిపించదు.. ఆరోగ్యమైన జుట్టు కోసం మన వంటిల్లే ఆయుర్వేద నిలయం అని చాలా మందికి తెలియదు..అవును, ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఆవాలు, కరివేపాకు మీ జుట్టు సమస్యలకు దివ్యౌషధం. అదేలాగో ఇక్కడ చూద్దాం…

ప్రతి ఒక్కరూ తమ జుట్టు పట్టులా అందంగా, నల్లగా మెరుస్తూ ఒత్తుగా పొడవుగా పెరగాలని కోరుకుంటారు. ఇందుకోసం వివిధ రకాల ఖరీదైన నూనెలు, షాంపూలను ఉపయోగిస్తారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం..సహజంగా జుట్టు రంగును తిరిగి పొందాలంటే ఆవాలు, కరివేపాకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జుట్టులోని మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజితం చేసి జుట్టు సహజ నల్ల రంగు తిరిగి రావడానికి సహాయపడతాయి. దీని కోసం మీరు చేయాల్సింది ఇదే.

ముందుగా గుప్పెడు ఆవాలను తక్కువ మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేయించి చల్లారిన తర్వాత రెండింటినీ మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టించుకోవాలి. వేళ్లతో స్మూత్‌గా మార్థనా చేసుకోవాలి. సుమారు మూడు, నాలుగు గంటల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

తరచూ ఇలా చేస్తూ ఉంటే కొత్తగా వచ్చే జుట్టు నల్లగా పెరుగుతుంది. ఉన్న తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. క్రమంగా తెల్ల జుట్టు తగ్గడం మొదలవుతుంది. అతి త్వరలోనే ఈ మార్పును మీరు గమనిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *