పెద్ద చిక్కుళ్లను ఫ్లాట్ బీన్స్ అని కూడా అంటారు. ఇవి మార్కెట్లో తరచూ లభించే అనేక రకాల కూరగాయలలో ఒకటి . వీటిని అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. పెద్ద చిక్కుళ్లు వంట రుచిని పెంచడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవి శరీరానికి, ఆరోగ్యానికి తగినంత పోషణను అందిస్తాయి. వర్షా కాలంలో పెద్ద చిక్కుళ్లు అధికంగా లభిస్తాయి. పైగా ఈ సీజన్‌లో వీటిని తినడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీని ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
ఫ్లాట్ బీన్స్ శరీరానికి అనేక విధాలుగా పోషకాలను అందిస్తాయి. అంతే కాదు వీటిలో ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్ వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే బీన్స్ ఆహారంలో భాగం చేసుకోవడం మంచింది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. అంతే కాదు ఫ్లాట్ బీన్స్ జీర్ణ సమస్యలు, విరేచనాలను నివారిస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు
పెద్ద చిక్కుళ్లలో లభించే విటమిన్ బి1 మెదడు పనితీరుకు కీలకమైన న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన ఎసిటైల్‌కోలిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వీటిలోని విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
ఇవి కూడా చదవండి
శ్వాసకోశ సమస్యల నివారణ
పెద్ద చిక్కుళ్లు డోపమైన్, గెలాక్టోస్ వంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే రసాయనాలను విడుదల చేయడంలో సహాయపడతాయి. అవి వయస్సు సంబంధిత అనేక వ్యాధులను నివారిస్తాయని కూడా పలు పరిశోధనల్లో వెల్లడైంది. వాటిలో ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
మానసిక ఒత్తిడి తగ్గుదల
రక్తహీనత, ఎముకల బలహీనతతో బాధపడేవారికి పెద్ద చిక్కుళ్లు చాలా మంచివి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని తప్పకుండా తినాలి. వీటిల్లో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల పోషకాల లోపాన్ని తీరుస్తాయి. అంతేకాకుండా వీటిల్లో ఉండే అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యతకు, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో దోహదపడతాయి.
బరువు తగ్గడంలోనూ కీలకమే..
పెద్ద చిక్కుడు గింజల్లో థయామిన్, విటమిన్ కె, బి6, రాగి, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్ ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఔషధంగా పనిచేస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.