సినిమాలో హీరోలు రాణిస్తుంటే బుల్లి తెరపై యాంకర్స్ ఇరగదీస్తున్నారు. ఇక యాంకర్ రవి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా, వేదిక ఏదైనా సమయస్ఫూర్తితో రవి వేసే పంచులు, జోకులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రవి, లాస్య కాంబినేషన్ లో వచ్చిన టీవీ షోలు బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరించాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో హవా సాగిస్తోన్న మేల్ యాంకర్లలో రవి కూడా ఒకరు. ముఖ్యంగా పటాస్ కామెడీ షో తో రవికి బాగా పేరు వచ్చింది. ఇందులో శ్రీముఖితో కలిసి రవి చేసిన అల్లరి మాములుగా లేదు. కాగా బుల్లితెరపై అడుగు పెట్టిన చాలా ఏళ్లకు కానీ తనకు పెళ్లైన విషయం, ఒక పాప కూడ ఉందన్న విషయాలను అసలు బయటకు చెప్పలేదు రవి.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
అయితే సుమారు ఐదేళ్ల క్రితం ఒక సోషల్ మీడియా పోస్టుతో తనకు నిత్యా సక్సేనా అనే అమ్మాయితో పెళ్లైందని, కూతురు వియా ఉందంటూ బాంబు పేల్చాడు. దాంతో ఆయన లేడీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రీసెంట్ డేస్ లో రవి పెద్దగా సందడి చేయడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. తనపై చేతబడి జరిగిందని చెప్పి అందరూ అవాక్ అయ్యేలా చేశాడీ స్టార్ యాంకర్. అంతే కాదు అది కూడా ఓ ఫీమేల్ యాంకర్ చేయించిందని చెప్పాడు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి మాట్లాడుతూ.. మా బ్యాచ్ లోనే ఓ ఫీమేల్ యాంకర్ నా ఎదుగుదల చూడలేకపోయింది. ఆ లేడీ యాంకర్ నా పై చేతబడి చేయించింది. రీసెంట్ డేస్ లో పాపులర్ అయిన ఓ పూజారి చేత నాపై చేతబడి చేయించింది. నా కెరీర్ నాశనం చేయాలని ప్రయత్నించింది అని తెలిపాడు. ఒక మనిషి ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు.. నేను అలాంటి వారిని చాలా దగ్గరగా చూశా.. వాళ్లకు అదేం ఆనందమో నాకు తెలియదు. నేను ఈ చేతబడి అలాంటివి నమ్మను. దాని వల్ల ఎదో జరుగుతుందని నేను నమ్మను అంటూ చెప్పుకొచ్చాడు రవి. అయితే ఆ లేడీ యాంకర్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. దాంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి