ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన క్లైమాక్స్‌తో ‘రాంఝనా’ సినిమాను రీ రిలీజ్ చేయడం తనను కలతకు గురిచేసిందని ప్రముఖ సినీ నటుడు ధనుష్ అన్నారు. ఇది ఆ సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని పేర్కొన్నారు. ఇందుకు తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ‘ఎక్స్’లో ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల క్రితం తాను కమిట్ అయిన సినిమా ఇది కాదని పేర్కొన్నారు. సినిమాల్లో కంటెంట్‌ను మార్చడానికి ఏఐని ఉపయోగించడం ఇటు కళను, అటు కళాకారులను ఇద్దరినీ ప్రభావితం చేస్తుందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ పరిణామం కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ప్రమాదకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను నివారించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :