ఢిల్లీలోని ఓ ఫ్లైఓవర్ పై నిలిపి ఉంచిన కారులో మూడు మృతదేహాలు కనిపించడం పీర్ గఢీలో కలకలం రేపింది. ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డుపై నిలిపి ఉంచిన టాటా టియాగో కారులో ఈ విషాదం వెలుగు చూసింది. మృతులను 76 ఏళ్ల రణధీర్ , 47 ఏళ్ల శివ నరేష్ సింగ్, ఓ మహిళ లక్ష్మిగా గుర్తించారు. ఫ్లైఓవర్ పై కారు చాలాసేపటి నుంచి కదలకపోవడంతో వాహనదారులు దగ్గరికి వెళ్లి పరిశీలించారు. కారు లోపల ముగ్గురు వ్యక్తులు అపస్మారక స్థితిలో కనిపించారు. పోలీసులు కారు తలుపులు తెరిచి ముగ్గురినీ పరీక్షించగా.. అప్పటికే వారు మరణించినట్లు తేలింది. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడం, కారులోని వస్తువులు ఏవీ చోరీకాకపోవడం గుర్తించారు. దీంతో ఆ ముగ్గురూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి మధ్య ఉన్న బంధుత్వం ఏంటి మరణానికి గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. ఈ మరణాల వెనుక కుటుంబ సమస్యలు ఉన్నాయా లేదా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాక్ కు షాకిచ్చిన ట్రంప్ టీమ్ పీఓకేతో భారత మ్యాప్ సిద్ధం
పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి
బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హై అలర్ట్
అంగన్‌వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??