అస్సాం పర్యటనకు ప్రధాని మోదీ..రూ.5,450కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం..

అస్సాం పర్యటనకు ప్రధాని మోదీ..రూ.5,450కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం..


అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న అస్సాంలో రేపు ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈశాన్య భారతంలో నిర్మితమైన మొదటి అత్యవసర ల్యాండింగ్ కేంద్రం డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)లో 10:30కి ప్రధాని విమానం ల్యాండ్ కానుంది.ఎమర్జెన్సీలలో సైనిక విమానాలు, పౌర విమానాలు నేల మీదకు దిగడానికీ, నేల మీది నుంచి నింగి లోకి ఎగురడానికీ అనుకూలంగా దీనిని భారత వాయు సేన సమన్వయంతో నిర్మించారు. ఇది అత్యవసర సేవలను అందించడంలో కీలక పాత్రను పోషిస్తుంది.

ఈశాన్య ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో సహాయక, రక్షణ కార్యకలాపాలను వెనువెంటనే మొదలుపెట్టడానికి ఆ ప్రాంతాల్లో వ్యూహాత్మక అవసరాల్ని తీర్చడానికి ఇది తోడ్పడుతుంది.దీనిని రెండు రకాలుగా ఉపయోగించుకొనేటట్లు ఈ మౌలిక సదుపాయాన్ని తీర్చిదిద్దారు. 40 టన్నుల వరకూ ఉండే యుద్ధ విమానానికి అనుకూలంగా ఉండడంతో పాటు, గరిష్ఠంగా 74 టన్నుల వరకూ బరువు గల సామగ్రిని నింపిన రవాణా విమానం కూడా ఈఎల్ఎఫ్ నుంచి నింగికి ఎగిరేలా రన్ వే ను రూపొందించారు..ఇక్కడ మోదీ
యుద్ధ విమానాలు, రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ల గగనతల విన్యాసాల్ని వీక్షిస్తారు.

అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తి అయిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభిస్తారు.. అనంతరం గౌహతి లచిత్ ఘాట్‌ వద్ద 5450 కోట్ల పథకాలను ప్రారంభిస్తారు. ఇందులో రవాణా సేవలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులూ, డిజిటల్ సేవలను పటిష్ఠపరిచే ప్రాజెక్టులు, ఉన్నత విద్యను ప్రోత్సహించే ప్రాజెక్టులు, రవాణాను సౌకర్య ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు..వీటి వల్ల ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి గొప్ప ఊతం లభించనుంది.సుమారు రూ.3,030 కోట్ల ఖర్చుతో బ్రహ్మపుత్ర నది మీద నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆరు వరసలుగా, ప్రీస్ట్రెస్‌డ్ కాంక్రీట్ (పీఎస్‌సీ)తో నిర్మించిన ఈ వంతెన గౌహతి ని ఉత్తర గౌహతి తో కలుపుతుంది. ఈశాన్య భారతంలో అత్యధిక స్థాయిలో పీఎస్‌సీని ఉపయోగించి నిర్మించిన మొదటి వంతెన ఇది ..ఈ వంతెన వల్ల గౌహతి ని ఉత్తర గౌహతి మధ్య ప్రయాణ సమయాన్ని ఏడు నిమిషాలకు తగ్గిస్తుంది. భూ కంపాలు తట్టుకునేలా బేస్ ఐసొలేషన్ సాంకేతికతనీ, రాపిడికి తట్టుకొని నిలిచే బేరింగులనీ ఉపయోగించారు. బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ (బీహెచ్ఎంఎస్)ను కూడా సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

దేశ ఈశాన్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని అస్సాంలోని కామరూప్ జిల్లా అమీన్‌గావ్‌లో ఏర్పాటు చేసిన జాతీయ డేటా సెంటరును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ అత్యంత ఆధునిక డేటా సెంటరు మొత్తం 8.5 ఎండబ్ల్యూ లోడుతో సగటున ఒక్కో ర్యాకుకూ 10 కేడబ్ల్యూ సామర్థ్యంతో పనిచేస్తుంది. ప్రభుత్వ వివిధ విభాగాలకు కీలక సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇతర జాతీయ డేటా సెంటర్లకు డిజాస్టర్ రికవరీ సెంటరుగా ఉంటుంది. ఇది ఈశాన్య ప్రాంతాల్లో అతి ముఖ్య పౌర ప్రధాన సేవల్ని డిజిటల్ మాధ్యమం ద్వారా అందజేయడంలో ప్రభుత్వాలకు సహాయపడుతుంది. నార్త్ ఈస్టర్న్ రీజియన్ నేషనల్ డేటా సెంటరును డిజిటల్ ఇండియా దృష్టికోణానికి అనుగుణంగా ఉండేలాగానూ, ఆ ప్రాంతాల్లో ఐసీటీ వ్యవస్థను బలోపేతం చేసి, డిజిటల్ మాధ్యమం ద్వారా పటిష్ట, సురక్షిత, సర్వ కాలిక సేవల లభ్యతకు పూచీ పడే లక్ష్యంతోనూ దీనిని రూపొందించారు. ఐఐఎం- గౌహతి ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నత విద్యకీ, మేనేజ్మెంట్ విద్యకీ వెన్నుదన్నుగా ఐఐటీ గౌహతి నిలుస్తుంది.

పీఎమ్-ఈబస్ సేవా పథకంలో భాగంగా 225 విద్యుత్తు బస్సులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో గౌహతి కి చెందిన 100 బస్సులు, నాగ్‌పూర్‌కు, భావ్‌నగర్‌కు చెందిన చెరి 50 బస్సులతో పాటు చండీగఢ్‌కు చెందిన 25 బస్సులు ఉన్నాయి. ఈ నాలుగు నగరాల్లో విద్యుత్తు బస్సుల సేవలను మొదలుపెడుతుండడంతో, 50 లక్షలకు పైగా పౌరులకు స్వచ్ఛమైన, చౌకైన, విశ్వసనీయమైన సార్వజనిక రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రాంతాల్లో గతిశీలతనీ, జీవన నాణ్యతనీ మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *