అవినీలో పట్టుబడిన డబ్బును పంచుకునే విషయం ఇద్దరు కానిస్టుబుల్స్ గొడవపడి సస్పెండ్ అయిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఎండీ వసీమ్, ఉపేందర్‌లు కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే విధుల్లో భాగంగా రోడ్లపై వాహనాల తనిఖీలు చేపట్టి.. సరైన పత్రాలు లేని వాహనాలు, యాక్సిడెంట్లు అయిన వాహనాలను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తుంటారు. అలాంటి వాహనాలు.. చాలా ఏళ్ల పాటు అలాగే ఉండి తుప్పుపట్టిపోతూ ఉంటాయి. అయితే తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో తుప్పు పట్టిన వాహనాలను.. కానిస్టేబుల్స్ ఎండీ వసీమ్, ఉపేందర్.. తక్కువ ధరలకు బయటి వ్యక్తులకు విక్రయించేవారు. అలా వచ్చిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరూ పంచుకునేవారు.
అంతేకాకుండా స్టేషన్ పరిధిలో వచ్చే కేసులను సెటిల్‌మెంట్ చేస్తామంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల వీరిద్దరూ ఓ బైక్ ను స్థానికంగా మరమ్మత్తులు చేయించి.. దాన్ని మండల పరిధిలోని ఒక వ్యక్తి విక్రయించారు. అయితే బైక్ కొన్ని వ్యక్తి డబ్బు ఇచ్చి బైకును తీసుకెళ్లాడు. పోలీసుల దగ్గర బైక్ ను కొనుగోలు చేసిన వ్యక్తి పూర్తి డబ్బులు చెల్లించలేదు. దీంతో అతడు కలిసినప్పుడు మిగిలిన డబ్బులు చెల్లించాలని కానిస్టేబుల్స్ బలవంతం చేశారు. దీంతో బైక్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత మిగిలిన సొమ్మును ఇస్తానని అతని మొండికేసాడు.
అయితే బైక్ విక్రయించగా.. వచ్చిన కొంత సొమ్మును ఇద్దరు పంచుకున్నారు. అయితే పంపకాల్లో ఇద్దరి కానిస్టేబుల్స్ మధ్య తేడా వచ్చింది. కేవలం రూ.500 విషయంలో ఎటూ తేలకపోవడంతో వషీమ్, ఉపేందర్ మధ్య గొడవలు మొదలైంది. మరోవైపు బైక్ ను కొనుగోలు చేసిన వ్యక్తి.. పోలీసు కానిస్టేబుల్స్ వేధింపులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి మొత్తం గుట్టు రట్టయింది. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.