అయ్యో.. అది నీ పిల్ల కాదే.. పిల్లి పిల్ల..నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో!

అయ్యో.. అది నీ పిల్ల కాదే.. పిల్లి పిల్ల..నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో!


మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులు మాటలతో షేర్‌ చేసుకుంటే జంతువులు వాటి చేతలతో నిరూపిస్తాయి. ఈ వీడియోలో ఒక వానరం జాతివైరాన్ని మరిచి ఓ పిల్లికూనను చేరదీసి కన్నబిడ్డలా సాకుతోంది. క్షణం కూడా విడవకుండా ఆ పిల్లి కూనను అంటిపెట్టుకునే ఉంటోంది. పిల్లిపిల్ల కూడా కోతిని తన తల్లిలాగే భావిస్తూ దాని ఒడిలో హాయిగా నిద్రపోతోంది. కోతి, పిల్లి కూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించింది. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం గార్లవొడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ దృశ్యం భక్తులను,స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పిల్లికూనపట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో

కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?

విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో

తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *