కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఒక భారీ కొండచిలువ హల్చల్ చేసింది. జూలై 27, ఆదివారం రాత్రి హుజూరాబాద్ జూనియర్ కళాశాల సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద 8 అడుగుల కొండచిలువ కనిపించటంతో జనం భయంతో కేకలు వేస్తూ పరారయ్యారు. ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసాల్లోకి రావడంతో వారంతా షాక్ గురయ్యారు. కాసేపటికి తేరుకొని కర్రలతో శబ్దాలు చేస్తూ.. దానిని అక్కడి నుంచి తరిమేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే, అలా శబ్దాలు చేస్తున్న వారి మీదికి కొండ చిలువ దూసుకొచ్చేందుకు ప్రయత్నించటంతో జనం తలోదిక్కూ పారిపోయారు. దీంతో వారు స్నేక్ క్యాచర్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్, అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ భారీ సైజు కొండచిలువ వారికి కాసేపు చుక్కలు చూపించింది. చివరకు అతి కష్టం మీద అటవీశాఖ అధికారులు దానిని బంధించి.. అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :