
భారీ వర్షాలతో పుట్టల్లో ఉండాల్సిన పాములు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 12 అడుగుల పొడవైన భారీ కొండచిలువ కనిపించింది. స్థానికులు రోడ్డుపై పాకుతున్న కొండచిలువను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ సమీపంలోని రోడ్డుపై భారీ కొండచిలువను చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అంత పెద్ద కొండచిలువను చూసి షాక్ అయ్యారు.. వెంటనే దగ్గరలోని స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఇంతలోనే పాము అక్కడి నుంచి కనిపించకుండాపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..