అమ్మాయిలు ఎడమవైపునే ముక్కు పుడక ఎందుకు ధరిస్తారో తెలుసా? దీని వెనుక అసలు కారణం ఇదే..

అమ్మాయిలు ఎడమవైపునే ముక్కు పుడక ఎందుకు ధరిస్తారో తెలుసా? దీని వెనుక అసలు కారణం ఇదే..


మన పెద్దలు అనుసరించే అనేక సంప్రదాయాల వెనుక చాలా కారణాలు ఉంటాయి. వాటిలో మనం అనుసరించే సంప్రదాయం, సంస్కృతి దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గతంలో మన పూర్వీకులు చెవులు, ముక్కు కుట్టడం తప్పనిసరి పాటించేవారు. పురాతన కాలంలో పురుషులు, మహిళలు ఇద్దరూ చెవులను కుట్టుకునేవారు. అంతే కాదు మహిళలు తమ ముక్కులను కుట్టుకుని రకరకాల ఆభరణాలు ధరించేవారు. కానీ ఇది కేవలం అందం కోసం, సంప్రదాయం కోసం మాత్రమేకాదట. దీనివెనుక పెద్ద స్టోరీనే ఉంది. అవును.. ఈ విధంగా ముక్కు, చెవులను కుట్టడం వెనుక ఓ కారణం ఉంది. అలాగే ముక్కును ఎడమ వైపున మాత్రమే ఎందుకు కుట్టుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ముక్కు కుట్టడం వెనుక దాగివున్న మహిళల ఆరోగ్య రహస్యం

నేటి కాలంలో ముక్కు కుట్టించుకోవాలా? వద్దా? అనేది మహిళల నిర్ణయమే. కానీ గతంలో దానిని తప్పనిసరిగా పాటించేవారు. కొన్ని వర్గాలలో, ముక్కు కుట్టించుకోని అమ్మాయిలు వివాహం చేసుకోకుండా నిషేధించబడేవారట. తరువాత ఈ ఆచారం తగ్గడం ప్రారంభమైంది. అలాంటి ఆచారాలను పాటించే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గింది. దీన్ని ఇష్టపడేవారు, ఇంట్లో సంప్రదాయంగా ఉన్నవారు ముక్కు పుడక ధరించేవారు. కానీ ఇటీవల ఇది ఒక ట్రెండ్‌గా మారింది. యువత ఎక్కువగా ముక్కు కుట్టించుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. కొందరు, సినిమాలు చూడటం ద్వారా ప్రేరణ పొంది, ముక్కుకు రెండు వైపులా ముక్కు పుడక ధరించడం ప్రారంభించారు. అలంకార దృక్కోణం నుంచి, ఇది స్త్రీ అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఇది అందాన్ని పెంచడానికి మాత్రమే కాదు, ఈ ఆభరణాలు మహిళల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ముక్కు కుట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కొన్ని ప్రదేశాలలో వివాహిత స్త్రీలు దీనిని ధరించడం తప్పనిసరి. ఇది వివాహానికి చిహ్నం, ముక్కు కత్తి ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కొన్ని నమ్మకాల ప్రకారం, ముక్కు కుట్టడం పార్వతీ దేవిని గౌరవించే ఒక మార్గం. దీనిని పదహారు ఆభరణాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముక్కు లేదా చెవులను కుట్టడం ఒక రకమైన అలంకరణగా మనం పరిగణించవచ్చు. కానీ దాని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. వాస్తవానికి, ముక్కు కుట్టడం వల్ల మహిళలు పీరియడ్స్‌ సమయంలో కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారని వేదాలు, గ్రంథాలలో రాయబడి ఉంది. అంతేకాకుండా ఇది ప్రసవ సమయంలో బిడ్డకు జన్మనివ్వడాన్ని చాలా సులభతరం చేస్తుందని, ఇది ప్రసవ నొప్పిని తగ్గిస్తుందని చెబుతారు. కొన్ని పరిశోధన అధ్యయనాలు కూడా దీనిని సమర్థించాయి. అంతే కాదు ఇది మైగ్రేన్ నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందట..

ఇవి కూడా చదవండి

ముక్కుకు ఎడమ వైపునే ఎందుకు?

అమ్మాయిలు ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడక ఎందుకు ధరిస్తారు? అనే సందేహం మీకూ వచ్చే ఉంటుంది. నిజానికి, ముక్కు ఎడమ వైపు కొన్ని పునరుత్పత్తి అవయవాలతో ముడిపడి ఉంటుంది. ఈ భాగాన్ని కుట్టడం వల్ల ప్రసవ నొప్పి గణనీయంగా తగ్గుతుందని చెబుతారు. ఎడమ వైపు కుట్టడం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. బాల్యం నుంచి యుక్తవయస్సు వరకు ఏ వయసులోనైనా ముక్కు, చెవులను కుట్టవచ్చు. ఇది శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *