అమ్మబాబోయ్.! ప్రపంచ కుబేరుడా.. మజాకానా.. ఛారిటీలకు ఏకంగా అన్ని వేల కోట్లా విరాళమా? లెక్క చూస్తే..

అమ్మబాబోయ్.! ప్రపంచ కుబేరుడా.. మజాకానా.. ఛారిటీలకు ఏకంగా అన్ని వేల కోట్లా విరాళమా? లెక్క చూస్తే..


ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ మరోసారి భారీ విరాళం ఇచ్చారు. శుక్రవారం బెర్క్‌షైర్ హాత్వే స్టాక్‌లోని మరో 6 బిలియన్‌ డాలర్ల వాటాను గేట్స్ ఫౌండేషన్, నాలుగు కుటుంబ దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 51 వేల కోట్లు. వారెన్‌ బఫెట్‌ దాదాపు 20 ఏళ్లుగా ఇలా విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఆయన తన సంపదను దానం చేయడం ప్రారంభించినప్పటి నుండి ఇది అతిపెద్ద వార్షిక విరాళం.

దాదాపు 12.36 మిలియన్ బెర్క్‌షైర్ క్లాస్ బి షేర్లను విరాళంగా ఇవ్వడంతో బఫెట్ మొత్తం ఛారిటీలకు ఇచ్చిన విరాళం 60 బిలియన్ల డాలర్లకు పైగా పెరిగింది. గేట్స్ ఫౌండేషన్‌కు 9.43 మిలియన్ షేర్లను, సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్‌కు 943,384 షేర్లను, అతని పిల్లలు హోవార్డ్, సూసీ, పీటర్ నేతృత్వంలోని మూడు ఛారిటీలకు 6,60,366 షేర్లను విరాళంగా ఇచ్చారు. అవి వరుసగా హోవార్డ్ జీ బఫెట్ ఫౌండేషన్, షేర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్‌లు.

ఇన్ని షేర్లు విరాళంగా ఇచ్చినా కూడా బెర్క్‌షైర్ స్టాక్‌లో వారెన్ బఫెట్ ఇప్పటికీ 13.8 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం విరాళాలకు ముందు అతని 152 బిలియన్ల డాలర్ల నికర విలువ అతన్ని ప్రపంచంలోని ఐదవ అత్యంత ధనవంతుడిని చేసిందని ఫోర్బ్స్ మ్యాగజైన్ తెలిపింది. 2024 జూన్‌లో 5.3 బిలియన్‌ డాలర్లు, 2024 నవంబర్‌లో కుటుంబ దాతృత్వ సంస్థలకు 1.14 బిలియన్‌ డారర్లను విరాళంగా ఇచ్చారు. ఒక ప్రకటనలో బెర్క్‌షైర్ షేర్లను విక్రయించే ఉద్దేశం తనకు లేదని బఫెట్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో ఉన్న బఫెట్ 2006లో తన సంపదను దానం చేయడం ప్రారంభించారు. గతేడాది ఆయన తన వీలునామాను సైతం మార్చుకున్నారు. తన మరణాంతరం తన మిగిలిన సంపదలో 99.5% తన పిల్లలు పర్యవేక్షించే ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెందాలని రాశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *