అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!

అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!


భారతదేశానికి మరోసారి గర్వకారణంగా నిలిచింది టీమ్ స్నో ఇండియా. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం బ్రెకెన్‌రిడ్జ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్నో స్కల్ప్చర్ ఛాంపియన్‌షిప్ 2026లో టీమ్ స్నో ఇండియా కాంస్య పతకంతో పాటు పీపుల్స్ ఛాయిస్ అవార్డును సొంతం చేసుకుంది.“Corn: The Ultimate Domesticator” అనే ఆలోచనాత్మక శిల్పంతో ఈ ఘన విజయం సాధించింది. ప్రముఖ రచయిత యువాల్ నోవా హరారి రాసిన ‘సాపియన్స్’ పుస్తకంలోని అంశాల ప్రేరణతో “Corn: The Ultimate Domesticator” అనే శిల్పాన్ని ఈ బృందం రూపొందించింది. మానవుడు మొక్కజొన్నను సాగు చేశాడా లేక ఆ పంటలే మనిషి జీవనశైలిని మార్చేశాయా? అనే ఆలోచనాత్మక కోణాన్ని హాస్యంతో జోడించి మంచుపై ఆవిష్కరించారు. జహూర్ కాశ్మీరి, మృదుల్ ఉపాధ్యాయ్, సుహైల్ మొహమ్మద్ ఖాన్, మ్యాట్ సీలీలతో కూడిన ఈ నలుగురు సభ్యుల బృందం -31 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే చలిలో ఈ అద్భుతాన్ని సృష్టించింది. కేవలం చేతి పనిముట్లను మాత్రమే వాడుతూ, నాలుగు రోజుల్లో 12 అడుగుల ఎత్తు, 25 టన్నుల బరువున్న మంచు గడ్డను అద్భుత శిల్పంగా తీర్చిదిద్దింది. ఈ పోటీలో కొరియా బంగారు పతకం, మంగోలియా రజత పతకం సాధించగా, టీమ్ స్నో ఇండియా కాంస్య పతకంతో పాటు పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది. ఈ విజయంతో ప్రపంచ స్థాయి మంచు శిల్ప కళలో భారత్‌కు మరోసారి గుర్తింపు లభించింది. ఇది టీమ్ స్నో ఇండియాకు వరుసగా రెండో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. దక్షిణాసియాలోనే తొలి స్నో స్కల్ప్చింగ్ టీమ్‌గా ప్రపంచస్థాయిలో పోటీపడి విజయం సాధించిన బృందంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పోటీ నిర్వాహకుల ఆతిథ్యం, సహకారానికి టీమ్ కృతజ్ఞతలు తెలిపింది. పరిమితమైన స్పాన్సర్‌షిప్, ఆర్థిక సహాయం ఉన్నప్పటికీ దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతూ, భారత హిమాలయాల్లో స్నో ఆర్ట్ సంస్కృతి, శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, తమకు ప్రభుత్వాల మద్దతు ఉంటే మరింతగా రాణించగలమని టీమ్ మెంబర్స్ తెలిపారు. ఈ సందర్భంగా టీమ్ స్నో ఇండియాకు చెందిన మృదుల్ ఉపాధ్యాయ్ స్పందిస్తూ.. “జ్యూరీ అవార్డుతో పాటు ప్రజల అవార్డు కూడా గెలవడం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ పడే ప్రతి మంచు తుంపరకూ ఒక కథ చెబుతుంది అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశవ్యాప్తంగా వాటర్‌ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్‌

పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన

ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు

జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీల్లో గుండె ఝల్లుమనిపించే దృశ్యాలు

అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *