అనుమానాస్పద ట్రాక్టర్.. చెక్‌చేయగా.. మైండ్ బ్లాక్

అనుమానాస్పద ట్రాక్టర్.. చెక్‌చేయగా.. మైండ్ బ్లాక్


అన్నమయ్య జిల్లా సుండుపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సినీ ఫక్కీలో సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకుని, సుమారు రూ. 1.65 కోట్ల విలువైన 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు సూచనల మేరకు, ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీసులు సుండుపల్లి మండలం పించా ప్రాజెక్ట్ సమీపంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఒక ట్రాక్టర్‌ను గుర్తించి తనిఖీ చేయగా, భారీగా ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తూ స్మగ్లర్లు కనిపించారు. పోలీసులను చూడగానే స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేయగా, సిబ్బంది చాకచక్యంగా వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు అడవిలోకి పరారయ్యారు. పట్టుబడిన నలుగురిలో ఇద్దరు తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక స్మగ్లర్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 72 దుంగలతో పాటు ట్రాక్టర్, ట్యాంకర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఎక్కడి దాకా విస్తరించింది, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సుబ్బారాయుడు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు అని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *