బెంగళూరులో ఇంటి అద్దెలు,యజమానులు తీసుకునే అడ్వాన్స్ ల మీద ఒక కెనడా పౌరుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్.. వైరల్ గా మారింది. భారత్‌లో నివసిస్తున్న బెంగళూరులోని డోమ్లూర్ డైమండ్ డిస్ట్రిక్ట్‌లో అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్న ఓ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అద్దె వివరాలను ఎక్స్ లో పంచుకున్నారు. దాని అద్దె, కట్టాల్సిన డిపాజిట్ వివరాలు చూసిన నెటిజన్లు నివ్వెరపోతున్నారు. డోమ్లూర్ డైమండ్ డిస్ట్రిక్ట్‌లోని 3BHK ఫ్లాట్ కోసం తాను ఆరా తీయగా, రూ. 1.75 లక్షలు నెలకు అద్దె అని, అలాగే రూ. 19.25 లక్షల డిపాజిట్ చేయాలని ఓనర్ అడిగాడని తన పోస్టులో చెప్పుకొచ్చారు. ‘ఆ ఓనర్ అడిగిన డిపాజిట్ కంటే తక్కువకే కొత్త మహీంద్రా థార్ కారు కొనొచ్చు’అని కాలేబ్ ఆవేదన వ్యక్తం చేశారు.‘ఇందిరానగర్ పరిసరాల్లో 2 నుంచి 3 నెలల డిపాజిట్‌తో రూ.80 వేల నుంచి రూ.1 లక్ష మధ్య అద్దెకు ఇల్లు ఏమైనా ఉంటే చెప్పండ్రా బాబూ’ అంటూ కాలేబ్.. నెటిజన్లను అడిగారు. కాగా, అతడి పోస్ట్ గంటల్లోనే వైరల్ అయింది. ఇది ఇప్పుడు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవడం పెద్ద పనే’ అని ఒకరు, ‘ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తోంది’అని మరొకరు చెప్పొకొచ్చారు. మొత్తానికి ఈ పోస్ట్.. బెంగళూరులో సామాన్యులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అద్దె కష్టాలకు అద్దం పడుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుట్‌బాల్ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు
కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్
లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..
దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే
ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్ మసాలా నూరుతున్న తమన్