సంపదకు, అదృష్టానికి కారకుడైన శుక్రగ్రహం అతి త్వరలో ఆగస్టు 21న కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నది. దీని వలన అనేక శుభాలు కలగనున్నాయి. అంతే కాకుండా శుక్ర సంచారం నాలుగు రాశుల వారికి ఆర్థికంగా అదృష్టాన్ని తీసుకరానున్నది. వీరికి ఆగస్టు 21 నుంచి చేతి నిండా డబ్బే డబ్బుంట. మరి ఆ రాశుల్లో మీరాశి కూడా ఉందో లేదో చూసెయ్యండి.
తుల రాశి : ధనస్సు రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వలన ఏపని చేసినా కలిసి వస్తుంది. విద్యార్థులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులు అనేక లాభాల వస్తాయి. పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఆర్థికంగా ఆరోగ్య పరంగా వీరికి కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
మిథున రాశి: మిథున రాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం వలన అద్భతంగా ఉంటుంది. వీరు ఏపని చేసినా కలిసి వస్తుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులు ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులను పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఆరోగ్య పరంగా వీరికి కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారి లక్ష్మీనారాయణ రాజయోగం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతయి. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి.
మీనరాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లక్ష్మీనారాయణ రాజయోగం వలన మీన రాశి వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారు అనుకోని విధంగా మనీ సంపాదించడమే కాకుండా , ప్రమోషన్స్ కూడా అందుకుంటారు. ఈ లక్ష్మీనారాయణ యోగం వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా సంపద రెట్టింపు అవుతుంది. డబ్బుకు లోటే ఉండదు.