అది ఇది కాదు.. మటన్‌లోని ఈ పార్ట్‌ను ట్రై చేయండి.. రోగాలన్నీ ఇక పాయ పాయ అనాల్సిందే..

అది ఇది కాదు.. మటన్‌లోని ఈ పార్ట్‌ను ట్రై చేయండి.. రోగాలన్నీ ఇక పాయ పాయ అనాల్సిందే..


నాన్ వెజ్ ప్రియులు చాలా మందికి మటన్ అనగానే నోరూరుతుంది.. మటన్.. అనగానే చాలామందికి దాని రుచి.. ఒక మంచి విందు గుర్తుకొస్తుంది.. అయితే, మటన్ కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదని, ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు.. మటన్లోని ప్రతి భాగం.. అంటే.. మటన్, తలకాయ, లివర్, కాళ్లు, దబ్బ, బోటి.. ఇలా అన్ని.. వేటికవే ప్రత్యేకమైనవి.. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి..

అయితే.. మటన్ లోని ప్రతి భాగం అద్భుతమైన రుచితోపాటు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉంటాయి.. అయితే.. మేక కాళ్లు.. మరిన్ని పోషకాలను కలిగి ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు.

ఆరోగ్యానికి మటన్ పాయ స్పెషల్..

మేక కాళ్ళ సూప్ లేదా పాయ సూప్.. ఎముకల బలానికి, శారీరక నొప్పుల నుంచి ఉపశమనానికి ఆరోగ్యకరమైన వంటకం.. దెబ్బలు తగిలి రక్తం కోల్పోయినప్పుడు లేదా కాళ్లు చేతులు లాగుతున్నప్పుడు ఈ సూప్‌ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుందని.. శరీరంలో ఎముకల మజ్జ వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు.

మటన్ పాయ (మేక కాళ్ల సూప్) లో కొల్లాజెన్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియంతోపాటు విటమిన్లతో సమృద్ధిగా ఉంటుందని, అందుకే.. ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా.. రెండు సార్లు పాయా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

పాయా కీళ్ల నొప్పులను తగ్గించి, ఎముకలను బలోపేతం చేయడంతోపాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అనారోగ్యం తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తికి మేక కాళ్ళ సూప్..

బలహీనపడిన ఇమ్యూనిటీకి మేక కాళ్ళ సూప్ చాలా మంచిది. ఇది శరీర రక్షణ వ్యవస్థను సహజంగా బలోపేతం చేయడానికి అద్భుతమైన మార్గం. ఈ సూప్ శరీరానికి మంచి వెచ్చదనాన్ని అందించి, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అందుకే చాలామంది దీన్ని ఒక అద్భుతమైన ఇంటి చిట్కాగా వాడతారు.

జలుబు, ఎముకల నొప్పులకు మటన్ బోన్ సూప్..

ఎంతకీ తగ్గని దీర్ఘకాలిక జలుబు లేదా ఎముకల నొప్పులతో సతమతమవుతున్నారా? దీనికి మన పెద్దలు తరతరాలుగా సూచించిన నల్లి సూప్ ఒక మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇది కేవలం జలుబును తగ్గించడమే కాదు.. ఫ్రాక్చర్ అయిన ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడుతుంది. అంతేకాకుండా, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎముకలకు అదనపు బలాన్ని ఇస్తుంది.

నో ఫ్రై..

అయితే.. మటన్ ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి, దాన్ని ఎలా వండుతున్నాం, ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒక్కసారి మటన్ తీసుకోవడం మంచిది. ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు. సూప్ రూపంలో గానీ, తక్కువ నూనెతో కూరగా వండుకుని తినడం వల్ల దానిలోని పోషక ప్రయోజనాలు సంపూర్ణంగా అందుతాయి. వేయించిన (ఫ్రై చేసిన) లేదా గ్రిల్ చేసిన మటన్‌లో కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *