ఉదాహరణకు రూ.25 లక్షలు 8.2 శాతం వడ్డీతో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి సుమారు రూ.2,05,000 వడ్డీ వస్తుంది. అంటే త్రైమాసికానికి రూ.51,250, నెలకు సుమారు రూ.17,083 ఆదాయం లభిస్తుంది. ఒకసారి పెట్టుబడి చేసిన తర్వాత ఆ కాలానికి వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. దీంతో రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు.