అతిగా ఆలోచించే అలవాటు భారతీయులకే ఉందట.. రోజుకి మూడు గంటలకు పైగా ఆలోచిస్తూ వేస్ట్ చేస్తున్నారట..

అతిగా ఆలోచించే అలవాటు భారతీయులకే ఉందట.. రోజుకి మూడు గంటలకు పైగా ఆలోచిస్తూ వేస్ట్ చేస్తున్నారట..


కొంతమంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది సహజం. ఎందుకంటే ప్రతి నిర్ణయం సరైన పరిశీలన తర్వాతే తీసుకోవాలి. అయితే ఎటువంటి కారణం లేకుండా ఒకే విషయం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం సరైనది కాదు. కొంతమంది ప్రతి చిన్న విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ అలవాటు కొంతకాలం తర్వాత వారి అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

ప్రతి వ్యక్తి ఒక విషయం లేదా ఏదైనా సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని భావిస్తాడు. అయితే ఇలా ఆలోచించే అలవాటు మీకు ఒక్కరికే లేదని తెలుసా.. ప్రపంచంలో ఒకే విషయం గురించి నిరంతరం అనవసరంగా ఆలోచిస్తూ ఉండే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అయితే ఇటీవల ఒక అధ్యయనంలో అనవసరంగా ఎక్కువగా ఆలోచించే అలవాటు భారతీయులకే ఎక్కువగా ఉందని తేలింది.

అధ్యయనం ఏం చెబుతోంది?
సెంటర్ ఫ్రెష్, యుగోవ్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో దాదాపు 81 శాతం మంది ప్రజలు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని తేలింది. కొంతమంది చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. 81 శాతం మంది భారతీయులు రోజుకు మూడు గంటలకు పైగా ఎక్కువగా ఆలోచిస్తూ వృధా చేస్తున్నారని సర్వేలో తేలింది. అనేకాదు ప్రతి ముగ్గురిలో ఒకరు అతిగా ఆలోచించే అలవాటు నుంచి బయటపడేందుకు గూగుల్ లేదా చాట్‌జిపిటి సహాయం తీసుకుంటున్నారు. ఎవరికైనా బహుమతి ఇవ్వడం, కెరీర్ ఎంచుకోవడం నుంచి మెసేజ్ ని అర్థం చేసుకోవడం వరకు ప్రతిదానికీ చాట్‌జిపిటి వంటి AI సలహా తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

టైర్ 1, 2 , 3 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు పాల్గొన్నారు. జీవనశైలి అలవాట్లు, సామాజిక జీవితం, డేటింగ్, సంబంధాలు, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు పాల్గొన్న వ్యక్తులు సమాధానమిచ్చారు. భారతదేశంలో అతిగా ఆలోచించడం రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిందని సర్వే వెల్లడించింది.

గూగుల్, చాట్GPT
ఈ సమస్య పెద్ద నగరాల్లోనే కాదు చిన్న నగరాల్లో నివసిస్తున్న ప్రజల్లో కూడా కనిపిస్తోంది. చాలా మంది అనవసరంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూడటం, ఆఫీసులో బాస్ చేసే ఒకే మెసేజ్ అర్థం కోసం వెతకడం, రెస్టారెంట్‌లో ఏమి ఆర్డర్ చేయాలో, మీ స్టోరీలో సెల్ఫీ లేదా ఏదైనా ఫోటో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కొంతమంది ఏదైనా పోస్ట్ చేసే ముందు చాలాసార్లు ఆలోచిస్తున్నారని అధ్యయనంలో వెల్లడయింది.

ఈ అధ్యయనం U Goa అనే అంతర్జాతీయ పరిశోధనా సంస్థ నిర్వహించింది. దీనికి సంబంధించిన సమాచారం సెంటర్ ఫ్రెష్ ఇండియా ఓవర్ థింకింగ్ నివేదికలో వెలువడింది. నేటి ఆధునిక ప్రపంచంలో అతిగా ఆలోచించడం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడమే తమ లక్ష్యం అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే తమ అధ్యయనంలో తెలిసిన సమాచారం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఒక సందేశాన్ని పునరాలోచించడం లేదా రాత్రి సమయంలో రేపు చేయాల్సిన ఆహారం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది రోజువారీ అలవాటుగా మారిందని చెప్పారు. ఈ అలవాటు ప్రతి ప్రాంతంలో వ్యాపిస్తోంది. ఈ చక్రాన్ని విచ్ఛిన్నం చేయాలంటే తమని తాము విశ్వసిస్తూ ముందుకు సాగాలని చెప్పారు. అంతేకాదు మీరు ఏమి భావిస్తున్నారో చెప్పండి. మీకు నచ్చినది ధరించండి. మీరు నమ్మేదాన్ని పోస్ట్ చేయండని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *