రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క టీజర్‌తోనే సినిమా బిజినెస్ అలా పెరిగిపోయింది. పైగా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి హీరోలుండటంతో కూలీ రేంజ్ మారిపోయింది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అన్నింటికంటే హైలైట్. ఆగస్ట్ 14న విడుదల కానుంది కూలీ. ఇప్పటి వరకు కూలీకి అంతా పాజిటివ్వే జరిగింది. కానీ ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు షాక్ తగిలింది. కూలీ సినిమాను ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు లోకేష్.
అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలనే దీనికి కూలీ అని ఫిక్స్ చేసారు. కానీ హిందీలో ఈ టైటిల్ మారిపోయిందిప్పుడు. అక్కడ కూలీ కాస్తా మజ్దూర్‌గా మారిపోయాడు. ఈ రైట్స్ మరో నిర్మాతతో ఉండటమే దీనికి కారణం.
కూలీలో ఉన్న సౌండింగ్ మజ్దూర్లో లేదు.. కానీ మేకర్స్‌కు మరో ఆప్షన్ లేదు. 1981లో అమితాబ్ హీరోగా వచ్చిన కూలీ గుర్తుందిగా.. అప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయి చావు అంచుల వరకు వెళ్లొచ్చారు.
ఈ టైటిల్ రైట్స్ ఇంకా ఆ నిర్మాత దగ్గరే ఉన్నాయి.. ఆ తర్వాత గోవిందా, వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1గా వచ్చారు.. కానీ కూలీగా రాలేదు. రజినీ సినిమాకు టైటిల్ ఇవ్వనని చెప్పడంతో మజ్దూర్తో అడ్జస్ట్ అవుతున్నారు.