టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచి, ఫేవరెట్ బ్యూటీగా నిలిచింది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో సందడి చేసింది.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాలోనే తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన అందం, నటనతో మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ వరసగా ఆఫర్స్ వచ్చాయి.
దీని తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఒకప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ, టాప్ రేంజ్లో దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో బిజీ అయిపోయింది.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే బాలీవుడ్ చక్కేసి అక్కడ వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే బాలీవుడ్ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకొని, ప్రస్తుతం ఫ్యామిలీ, బిజినెస్, సినిమాలన్నింటినీ మెంటైన్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ చిన్నది, తాజాగా రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్లో బ్యూటిపుల్ లుక్లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.




