సాధారణంగా అధికారులు పాఠశాలలకు వెళ్తే రికార్డులు తనిఖీ చేసి, వసతులపై ఆరా తీసి వెళ్ళిపోతుంటారు. కానీ, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాత్రం ఇందుకు భిన్నంగా చిన్నారులతో కలిసిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేవలం అధికారిలా కాకుండా, ఒక ఉపాధ్యాయుడిలా మారిపోయారు. నేలపై పిల్లలతో కలిసి కూర్చుని, వారితో ముచ్చటించారు. “ఏ ఫర్ ఆపిల్”, “బి ఫర్ బాల్” అంటూ ఇంగ్లీష్ అక్షరాలను, ఒకటి నుండి ఇరవై వరకు అంకెలను చిన్నారులతో పలికించారు. జిల్లా కలెక్టరే స్వయంగా పాఠాలు చెబుతుంటే చిన్నారులు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. పిల్లల చదువుతో పాటు వారికి అందిస్తున్న ఆహారంపై కూడా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈరోజు ఏం తిన్నారు అంటూ ఆప్యాయంగా అడిగారు. పిల్లలు పప్పు అన్నం తిన్నాం అంటూ ఉత్సాహంగా బదులిచ్చారు. అంగన్వాడీ కేంద్రంలో హాజరు శాతం, పోషకాహార పంపిణీ తీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్యే పునాది అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మే ఆయన, ఇలా క్షేత్రస్థాయిలో చిన్నారులతో మమేకం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్
సిల్వర్ స్క్రీన్ మీద పెరుగుతున్న హింస
బిజీ అవుతున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్
కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అందాల భామలు