Sita Ramam: సీతారామం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా? బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నారుగా!

Sita Ramam: సీతారామం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా? బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నారుగా!


మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసిన సినిమా సీతారామం. 2022లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. క్లాసిక్ లవ్ స్టోరీగా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఫీల్ గుడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ అందాల తార మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భూమిక చావ్లా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వినీ ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్‌ నిర్మించిన ఈ క్లాసిక లవ్ స్టోరీ 2022 ఆగస్టు 5న విడుదలైంది. అంటే ఈ మూవీ విడుదలై సుమారు మూడేళ్ల పూర్తయ్యాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. సీతారామం సినిమా తర్వాతనే దుల్క‌ర్ స‌ల్మాన్‌కు టాలీవుడ్ లో మార్కెట్ ఏర్ప‌డింది. ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్ అంటూ బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేయడం ప్రారంభించారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. సీతారామం కథ దుల్కర్ సల్మాన్ క‌న్నా ముందు ఇద్దరు తెలుగు హీరోలు ఇద్దరి వద్దకు వచ్చింది. కానీ వివిధ కారణాలతో ఆ ఇద్ద‌రూ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదట.

సీతా రామం లాంటి క్లాసిక్ ల‌వ్ స్టోరీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు మరెవరో కాదట. న్యాచుర‌ల్ స్టార్ నాని, రామ్ పోతినేని.
డైరెక్ట‌ర్ హ‌ను రాఘవ పూడి సీతారామం క‌థ‌ను మొద‌ట‌ న్యాచురల్ స్టార్ నానికి చెప్పార‌ట‌. ఆయ‌న‌కు క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ అప్ప‌టికే చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉండ‌టంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. ఇక ఆ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనిని సంప్రదించగా.. అతను కూడా అప్పటికే పలు సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడట. దీంతో చివ‌ర‌కు హ‌ను రాఘ‌వ‌పూడి దుల్క‌ర్ స‌ల్మాన్‌ను సంప్రదించారట. అతను వెంటనే ఒకే చెప్పడంతో సీతారామం సినిమా పట్టాలెక్కిందట.

ఇవి కూడా చదవండి

సీతారామం రిలీజ్ కు మూడేళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *