త్రిగుణ్, హెబ్బా పటేల్ కీలకపాత్రలలో నటించిన హారర్ థ్రిల్లర్ ఈషా. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన ఈ సినిమాను కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో పి. హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.
గతేడాది డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో అఖిల్ రాజ్, సిరి హనుమంతు సైతం నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీవాసు, వంశీ నందిపాటి కలిసి థియేటర్లలో విడుదల చేశారు. ఈషా సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుత సమాజంలో దెయ్యాలు, ఆత్మలనేవి ఉన్నాయని నమ్మే వాళ్లు ఎంత మంది ఉన్నారో.. లేవనే వాళ్లు అంతేమంది ఉన్నారు.
ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఆద్యంతం భయాన్ని పుట్టిస్తూనే ఆకట్టుకుంటుంది. నలుగురు స్నేహితులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి సినిమాల తర్వాత థియేటర్లలో విడుదలైన ఈషా సినిమా సైతం సూపర్ హిట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.




