Varalakshmi Vratham Mantras: వరలక్ష్మీ వ్రతం రోజున ఈ మంత్రాలు జపిస్తే కెరీర్ లో విజయం మీదే..! అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు..!

Varalakshmi Vratham Mantras: వరలక్ష్మీ వ్రతం రోజున ఈ మంత్రాలు జపిస్తే కెరీర్ లో విజయం మీదే..! అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు..!


శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతం రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలు జపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ పూజలో భక్తితో పాల్గొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఈ మంత్రాలను జపించండి. వరమహాలక్ష్మి వ్రతంలో జపించాల్సిన ముఖ్యమైన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వరమహాలక్ష్మి వ్రతంలో జపించాల్సిన మంత్రాలు

  • ఓం లక్ష్మీ నమః ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు, మంచి శక్తి పెరుగుతాయి. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
  • లక్ష్మీ నారాయణ నమః ఈ మంత్రం కుటుంబంలో ప్రేమ, సంతోషం, ఐకమత్యం పెంచుతుంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది.
  • ధనాయ నమః శుక్రవారం రోజున తామర పువ్వుతో ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది.
  • ధనాయ నమో నమః ప్రతిరోజు 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనవసరంగా డబ్బు ఖర్చవకుండా ఉంటుంది.
  • ఓం హ్రీం హ్రీం శ్రీ లక్ష్మీవాసుదేవాయ నమః శుభకార్యాలు ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
  • ఓం శ్రీం హ్రీం క్రీం శ్రీసిద్ధలక్ష్మ్యై నమః ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే ఆరోగ్యం, సంపద, ఆయుషు పెరుగుతాయని నమ్మకం.
  • పద్మనే పద్మ పద్మాక్షి పద్మ సంభవ్యే.. ఈ మంత్రం ఇంట్లో ధనం, ఆహారం లోటు లేకుండా చూస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది.

జపం చేయాల్సిన సమయాలు

  • ఈ వ్రతం రోజున కొన్ని మంత్రాలను 108 సార్లు జపిస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి.
  • ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః ఈ మంత్రాన్ని వ్రతం సమయంలో 108 సార్లు జపించాలి. ఈ మంత్రం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
  • ఓం నమో వరలక్ష్మీ మమ దరిద్రం నాశయ.. ఈ మంత్రాన్ని 11 సార్లు జపిస్తే పేదరికం, ఆర్థిక కష్టాలు తగ్గుతాయి.
  • ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ.. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

వరమహాలక్ష్మి వ్రత విధానం

వరమహాలక్ష్మి వ్రతం రోజున మహిళలు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. తమ శక్తిని బట్టి కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, ప్రసాదం.. అలాగే బంగారంతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో ముడిపడి ఉన్నందున.. లక్ష్మీదేవిని సౌభాగ్యానికి గుర్తుగా బంగారంతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. ఈ మంత్రాలను భక్తితో పఠించి, వరమహాలక్ష్మి అనుగ్రహం పొందండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *