శ్రావణ పౌర్ణమి రోజున ఈ పూజలు చేయండి..! మీ కోరికలు నెరవేరుతాయి.. కోటీశ్వరులు అవుతారు..!

శ్రావణ పౌర్ణమి రోజున ఈ పూజలు చేయండి..! మీ కోరికలు నెరవేరుతాయి.. కోటీశ్వరులు అవుతారు..!


శ్రావణ మాసంలో వచ్చే చివరి పౌర్ణమి ఆగస్టు నెలలో రెండు రోజులు ఉండటం వల్ల ఉపవాసం ఏ రోజు ఉండాలనే దానిపై చాలా మందికి గందరగోళంగా ఉంది. ధర్మశాస్త్రాల ప్రకారం.. పూర్ణిమ తిథి సాయంత్రం ఏ రోజున ఉంటుందో ఆ రోజునే ఉపవాసం చేయాలి.

పంచాంగం ప్రకారం.. 2025లో పూర్ణిమ తిథి ఆగస్టు 8న మధ్యాహ్నం 2:13 గంటలకు మొదలవుతుంది. ఈ తిథి ఆగస్టు 9న మధ్యాహ్నం 1:25 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఉపవాసం ఆగస్టు 8 శుక్రవారం నాడు చేయాలి. అదే సమయంలో రక్షాబంధన్ పండుగ మాత్రం పూర్ణిమ తిథి ఉదయం ఉండే రోజున జరుపుకుంటారు. కాబట్టి రక్షాబంధన్ ఆగస్టు 9న జరుపుకుంటారు.

శ్రావణ చివరి పూర్ణిమ నాడు చేయాల్సిన పూజలు

శ్రావణ చివరి పూర్ణిమ రోజున ఆగస్టు 8న కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రత్యేక పూజలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • విష్ణుమూర్తి పూజ.. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉండాలని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విష్ణుమూర్తికి పూజ చేయాలి. శంఖంలో నీరు పోసి విష్ణువుకు అభిషేకం చేయాలి. తులసి ఆకులతో పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అలాగే శంఖంలో కుంకుమపువ్వు కలిపిన పాలు, బియ్యం, పూలతో అభిషేకం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
  • శివుని పూజ.. శ్రావణ పూర్ణిమ నాడు శివుడికి పూజ చేయడం చాలా మంచిది. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కూడిన పంచామృతంతో అభిషేకం చేయాలి. శివ నామాలను జపిస్తూ పూజ చేస్తే అదృష్టం మెరుగుపడుతుందని నమ్మకం ఉంది. ఈ విధంగా విష్ణువు, శివుడు ఇద్దరినీ పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *