Naa Anveshana: హిందూ దేవుళ్లపై అసభ్యకర వీడియోలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్

Naa Anveshana: హిందూ దేవుళ్లపై అసభ్యకర వీడియోలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు ఇన్‌స్టాగ్రామ్ బిగ్ షాక్


ఆన్ లైన్ బెట్టింగ్ బాగోతాలను బయట పెట్టి హీరో అయిన ప్రపంచ యాత్రికుడు కొద్ది నెలల్లోనే జీరో అయిపోయాడు. భారతదేశాన్ని, అందులోనూ హిందూ దేవుళ్లను దూషిస్తూ అతను చేసిన వీడియోలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అంతవరకు ఎవరైతే అతనికి సపోర్టుగా నిలిచారో ఒక్కసారిగా దూరమయ్యరు. చాలా మంది ఫాలోవర్లు అతని సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేశారు. సుమారు పది లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు అన్వేష్ ను అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లో కేసులు కూడా నమోదయ్యాయి. అన్వేష్ వీడియోలు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అతని ఇన్ స్టాగ్రామ్ ఐడీని తొలగించాలంటూ మెటాసంస్థకు లేఖ రాశారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ పై బ్యాన్ విధించింది.

కాగా ఇన్స్ స్టా గ్రామ్ లో అన్వేష్‎కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్‎కు తగ్గింది. ఇప్పుడు ఏకంగా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పై బ్యాన్ విధించడంతో అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *